Verse
దేవర నీ దీవెనలు
ధారాళముగను వీరలపై
బాగుగ వేగమే దిగనిమ్ము
పావన యేసుని ద్వారగను‖ 2x ‖
Verse
దంపతులు దండిగ నీ
ధాత్రిలో వెలయుచు సంపదలన్
సొంపుగ నింపుగ పెంపగుచు
సహింపున వీరు సుఖించుటకై‖ దేవర నీ ‖
Verse
ఈ కవను నీ కరుణన్
ఆకరు వరకును లోకములో
శోకము లేకయే ఏకముగా
బ్రాకటముగను జేకొనుము‖ దేవర నీ ‖
Verse
ఇప్పగిది నెప్పుడును
గొప్పగు ప్రేమతో నొప్పుచు దా
మొప్పిన చొప్పున దప్పకను
మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్‖ దేవర నీ ‖
Verse
తాపములు పాపములు
మోపుగ వీరిపై రాకుండగా
గాపుగ బ్రాపుగ దాపునుండి
యాపదలన్నియు బాపుచును‖ దేవర నీ ‖
Verse
సాధులుగన్ జేయుటకై
శోధనలచే నీవు శోధింపగా
కదలక వదలక ముదమున నీ
పాదము దాపున బాదుకొనన్‖ దేవర నీ ‖
Verse
మెండుగ భూమండలపు
గండములలో వీరుండగను
తండ్రిగ దండిగ నండనుండి
వెండియు వానిని ఖండించావే‖ దేవర నీ ‖
Verse
యిద్దరు వీరిద్దరును
శుద్ధులై నిన్ను సేవించుటకై
శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్
దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్‖ దేవర నీ ‖
Verse
వాసిగ నీ దాసులము
చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని
మా సకలేశ్వర నీ సుతుడ
యేసుని పేరిట బ్రోవుమామేన్‖ దేవర నీ ‖