Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devara Nee Deevenalu Dharalamuganu Veeralapai

దేవర నీ దీవెనలు ధారళముగను వీరలపై

Devara Nee Deevenalu Dharalamuganu Veeralapai

Verse
దేవర నీ దీవెనలు - ధారళముగను వీరలపై
బాగుగ వేగమే దిగనిమ్ము - పావన యేసుని ద్వారగను
Verse
దంపతులు దండిగ - నీ ధాత్రిలొ వెలయుచు సంపదలన్
సొంపుగ నింపుగ పెంపగుచు - సహింపున వీరు సుఖించుటకై‖ దేవర ‖
Verse
ఈ కవను నీ కరుణన్ - ఆఖరు వరకును లోకములో
శోకము లేకయె యేకముగా - బ్రాకటముగను జేకొనుము‖ దేవర ‖
Verse
ఇప్పగిది నెప్పుడును - గొప్పగు ప్రేమచే నొప్పుస
దా - మొప్పిన చొప్పున దప్పకను - మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్‖ దేవర ‖
Verse
తాపములు పాపములు - మొపుగ వీరిపై రాకుండగా -
వుగ - బ్రాపుగ దాపునుండి - యపదలన్నియు బాపుచును‖ దేవర ‖
Verse
సాధులుగన్ చేయుటకై శోధనలచె నీవు శోధింపగా
గదలక వదలక ముదమున నీ - పాదము దాపున బాదుకొనన్‖ దేవర ‖
Verse
మెండుగ భూ మండలపు - గుండములలో వీరుండగను
దండ్రిగ దండిగ నండనుండి - వెండియు వానిని ఖండింపన్‖ దేవర ‖
Verse
ఇద్దర వీరిద్దరును - శుద్దులై నిన్ను సేవించుటకై
శ్రద్దతో బుద్ధిగ సిద్ధపడన్ - దిద్దుము నీ ప్రియ బిడ్డలుగన్‖ దేవర ‖
Verse
వాసగ నీ దాసులము - చేసిన యీ మొఱల్ దీసికొని
మా సకలేశ్వర నీ సుతుడౌ - యేసుని పేరిట బ్రోవు మామెన్

Related Tags

PrayerBlessingWedding