Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devarani Deevenalu Dharalamuganu Veeralapai

దేవరనీ దీవెనలు ధారళముగను వీరలపై

Devarani Deevenalu Dharalamuganu Veeralapai

Lyricist: అల్లారి పెదవీరాస్వామి
Verse
దేవరనీ దీవెనలు ధారళముగను వీరలపై
బాగుగా వేగమే దిగనిమ్ము
పావన యేసుని ద్వారగను
Verse
దంపతులు దండిగనుధాత్రిలో వెలయుచు సంపదలన్
సొంపుగ నింపుగ పెంపగుచు
సహింపున వీరు సుఖించుటకై
Verse
ఈ కవను నీ కరుణన్ ఆఖరు వరకును లోకములో
శోకము లేకయె యేకముగా
బ్రాకటముగను జేకొనుము
Verse
ఇప్పగిది నెప్పడును గొప్పగు ప్రేమతో నొప్పచు దా
మొప్పిన చొప్పన దప్పకను
మెప్పగ బ్రతుకగ బంపు కృపన్
Verse
తాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగా
గాపుగ బ్రాపుగ దాపునుండి
యాపదలన్నియు బాపుచును
Verse
సాదులుగన్ జేయుటకై శోధనలచే నీవు శోధింపగా
కదలక పదవక ముదమున నీ
పాదము దాపున బాపున బాదుకొనున్
Verse
మెండుగ భూమండలపు గండములలో వీరుండగను
తండ్రిగ దండిగ నండి నుండి
వెండియు వానిని ఖండించవే
Verse
ఇద్దరు వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై
శ్రద్దతో బుద్దిగా సిద్దపడన్
దిద్దుము నీ ప్రియబిడ్డలుగను
Verse
వాసిగ నీ దాసులము చేసిన యీ మొఱల్ దీసికొని
మా సకలేశ్వర నీ సుతుడౌ
యేసుని పేరిట బ్రోవు మామెన్

Related Tags

BlessingMarriageWedding