Chorus
దేవసుతుడు యేసు జన్మించె - నిరతము స్తుతియింతుము
Verse
పాపుల రక్షించ పరమ నాథుడు - శ్రమలను పొందెను ఆ ...‖ ఆ ‖
నశియించిన వారిన్ వెదకి రక్షింప - రక్షకుడై పుట్టెను
Verse
బెత్లెహేములో నుత్తముడు జన్మించెను - తండ్రి చిత్తము చేసెను ఆ ...‖ ఆ ‖
భక్తులు పాదములకు మ్రొక్కిరి - మనము స్తుతియింతుము
Verse
ఘనుడు పుట్టెను పశుల పాకలో - గొల్లలు పూజించిరి ఆ ...‖ ఆ ‖
వేరే జనులు చోటీయకున్నను - మనము స్తుతియించెదము
Verse
పుట్టినరాత్రి ప్రకాశమానం - మృతిన్ పగటలో ఆ ...‖ ఆ ‖
స్తుతులకు తగిన శుద్ధుడు దూతల - స్తుతులను బొందెన్
Verse
నరులు బొంకినను వేదము బొంకదు - నరుల హృదయమేమో ఆ ...‖ ఆ ‖
పుణ్యుని జన్మము మీ మదినున్న - పూజింతురు వాని
Verse
అనాది దేవుని చిత్తముచే - శ్రీ - బయలుపడెను ఆ ...‖ ఆ ‖
జలనిధి వలెనే ఆయన జ్ఞానము - మనలను నింపును
Verse
ఆనందముగా యెహోవాకు - హల్లెలూయ పాడెదము ఆ ...‖ ఆ ‖
హల్లెలూయ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ - హల్లెలూయ ఆమెన్