Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devathma Jayo Deenadayalu Pavanathma

దేవాత్మ జయో దీనదయాళూ పావనాత్మ

Devathma Jayo Deenadayalu Pavanathma

Lyricist: Chetti Bhanumurthy
Chorus
దేవాత్మ జయో దీనదయాళూ పావనాత్మ మము బ్రోచితహో నీవే గదా
మా నిజరక్షణకై జీవమీయ ధర జేరితహో‖ జేరితహో ‖
Verse
సుగుణాత్ములలో సుగుణము నీవే నిగమము లెరుగని నీతివహో
సుజనాత్ముల కిల సుజ్ఞానాత్మవు సవినయ భక్తికి సారమహో‖ సారమహో ‖
Verse
పేదలలో నిరు పేదవు నీవే సాధులలో ఘన సాధువహో మోదమలర
మా ముక్తిని గూర్చిన సాధు పేదజన సోదరహో‖ సోదరహో ‖
Verse
దీనాత్ములలో దీనుడవై భవదీయ దయారస ధారలహో దినదిన
మొసగిన దేవాత్మజ యిమ్మాను యేలు వం దనములహో‖ వం దనములహో ‖
Verse
పరమ పూజ్యుడా పరిమిత ప్రేమాభరితుడ సంస్థవ పాత్రుడహో
నిరతము నిన్నేమరక నుతిం చెద నరజన గణముల నేస్తడహో‖ నేస్తడహో ‖

Related Tags

WorshipDevotionalPrayer