Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devudante Neekishtama E Kashtanikaina Sidha

దేవుడంటే నీకిష్టమా ఏ కష్టానికైన సిద

Devudante Neekishtama E Kashtanikaina Sidha

Chorus
దేవుడంటే నీకిష్టమా ఏ కష్టానికైన సిద్ధమా‖ 2x ‖
అవసరానికే దైవమా అనుభవించుటే న్యాయమా
నీ సుఖమే ముఖ్యమా తన త్యాగమే వ్యర్ధమా
నీ బ్రతుకే నీ ఇష్టమా‖ 2x దేవునికే సంతాపమా ‖
Verse
హానోకు భూమిపై దేవునితో నడచెను
దేవునికే యిష్టుడై దేవుడతనిని తీసుకెళ్ళెను
నువ్వు దేవునికిష్టుడవైతే నిను కూడా తీసుకెళ్ళును
తన దూతలనే పంపి లాజరువలె తీసుకెళ్ళును
దేవునిలో కష్టపడి రక్షించుటకిష్టపడి
దేవుని సేవకు సమస్తాన్ని అర్పించాలి
ఆదేవుని పని చేసేవారతనికి కావాలి
వారే తనకిష్టం తన ఇష్టం ఎవరికి ఇష్టం
Verse
నశియించు ఆత్మల కొరకు కదలాలి నీవు నేడు
తన వారిని రక్షించుట కొరకు నలగాలి ప్రతి రోజు
క్రీస్తునే నమ్ముటకాక శ్రమపడుటే నేర్చుకోవాలి
నిను చూచిన ఆదేవుడే దూతలతో పొంగిపోవాలి
ఒక్క పాపి మారితే ఒకరిని నీవు మార్చితే
అంతకన్న ఆదేవునికింకేమి కావాలి
ఆదేవుని పనిలో మరణిస్తే నినుచూడాలి
వారే తనకిష్టం తన ఇష్టం ఎవరికి ఇష్టం

Related Tags

CommitmentSacrificeDevotion