Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devude Ila Cheretanduku

దేవుడే ఇల చేరేటందుకు

Devude Ila Cheretanduku

Lyricist: Sayaram Gattu
Verse
దేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం
అమ్మా అంటూ పిలుచుకొని పొందుకొనెను జన్మం
నీకంటూ ఏది లేదన్నట్లు ఎందుకంత త్యాగం
కనరాని ప్రేమకు నీవేగా కదలాడుతున్న రూపం‖ 2x ‖
అమ్మా నీ ఋణమును తీర్చే సిరులు లేవు ఇలలో
ఆ దైవము సైతము నేర్చె పాఠాలు చల్లని నీ ఒడిలో‖ 2x దేవుడే ‖
Verse
కన్న బిడ్డను పరాయి బిడ్డగా పెంచుకున్న మమకారం
తన ప్రజల విముక్తికి దేవుడు చేసిన కార్యంలో సహకారం‖ 2x ‖
మోషేగా మారిన పసివాడిని
దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం‖ 2x అమ్మా ‖
Verse
సంతతి లేక సవతి పోరుతో విసిగినట్టి దీనత్వం
దేవుని సన్నిధి హృదయము పరచి పొందుకొనెను మాతృత్వం‖ 2x ‖
హన్నా చేసిన ఆ త్యాగమే కాదా
సమూయేలు పొందిన న్యాయాధిపత్యము‖ 2x అమ్మా ‖
Verse
కొన ఊపిరితో సిలువపైన వేళాడుతున్న క్షణము
ఆ దేవ దేవుడు తీర్చుకొనెను తన మాతృమూర్తి ఋణము‖ 2x ‖
ప్రియ శిష్యుని దరికి తల్లిని చేర్చి
నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం‖ 2x అమ్మా ‖

Related Tags

SacrificeGratitudeMother