Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devude Maanavunigaa Janminchenu

దేవుడే మానవునిగా జన్మించెను

Devude Maanavunigaa Janminchenu

Lyricist: Late Dr Joseph Moses K
Verse
దేవుడే మానవునిగా జన్మించెను
ఈ భువిలో ఈ భువిలో
దేవుడే.. దేవుడే..
Verse
పాపాంధకారములో నశియించిన నన్ను
జీవ వెలుగు మార్గమున చేర్చెన్
నా సృష్టికర్త – నను ప్రేమించి
అరుదెంచెను – బెత్లెహేములో
Verse
నా పాప భారమును సిలువను మోయన్
నా పాప శాపమును సిలువను వేయన్
పరిశుద్ధుడే – నరరూపుడై
అరుదెంచెను – బెత్లెహేములో
Verse
శోధన నుండి నను విమోచింపన్
వేదన నుండి నను రక్షింపన్
పరమాత్ముడే – ఇమ్మానుయేలుడై
అరుదెంచెను – బెత్లెహేములో
Verse
మహిలో లేని మహిమను నాకు
వెల ఇచ్చి కొనలేని శాంతిని నాకు
సర్వోన్నతుడే – ప్రసాదింపను
అరుదెంచెను – బెత్లెహేములో

Related Tags

SalvationChristmasIncarnation