Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devude Manakashrayamunu

దేవుడే మనకాశ్రయమును

Devude Manakashrayamunu

Chorus
దేవుడే మనకాశ్రయమును
దుర్గమునై యున్నాడు - ఆపదలో
Pre-Chorus
కావున భూమి - మార్పు నొందినను
కొండలు మున్గినను - ఆపదలో ఆపదలో‖ 2x Aapadalo ‖
Verse
సముద్ర జలములు - ఘోషంచుచు - నురుగు కట్టినను
ఆ పొంగుకు పర్వతములు కదలినను - మనము - భయపడము
Verse
ఒక నది కలదు - దాని కాలువలు - దేవుని పట్టణమును
సర్వోన్నతుని - మందిర పరిశుద్ధ స్థలమును - సంతోషపర్చు చున్నవి
Verse
దేవుడా పట్టణములో - నున్నాడు దానికి - చలనము లేదు
అరుణో - దయమున దానికి సహాయము చేయుచున్నాడు
Verse
జనములు ఘోషించు - చున్నవి రాజ్యములు కదలు చున్నవి
ఆయన కంఠధ్వని వినిపించగా - భూమి కరిగి పోవుచున్నది
Verse
సైన్యములధిపతి - యెహోవా మనకు తోడైయున్నాడు
యాకోబు దేవుడు - మనకు ఆశ్రయమునై యున్నాడు
Verse
యెహోవా చేసిన - కార్యములను వచ్చి చూడండి
అగ్నిలో యుద్ధ రథములను కాల్చి వేయువాడాయనే
Verse
ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి
అగుదును అన్యజనులలో నేను మహోన్నతుండను

Related Tags

PsalmProtectionRefuge