Chorus
దేవుడే నా కాశ్రయంబు - దివ్యమైన దుర్గము = మ హా వినోదు
డాపదల స - హాయుడై నన్ బ్రోచును - అభయ - మభయ - మభయ
మెప్పు - డానంద - మానంద - మానంద మౌఁగ‖ దేవుఁడే ‖
Verse
పర్వతములు కదిలిన నీ - యుర్వి మారుపడినను
సర్వమున్ ఘోషించుచు నీ సంద్ర ముప్పొంగినన్
అభయ - మభయ - మభయ‖ దేవుఁడే ‖
Verse
దేవుడెప్డు తోడుగాగ - దేశము వర్ధిల్లును
ఆ-తావు నందు ప్రజలు
మిగుల - ధన్యులై వసింతురపుడు
అభయ - మభయ - మభయ‖ దేవుఁడే ‖
Verse
రాజ్యముల్ కంపించిన భూ - రాష్ట్రముల్ ఘోషించిన
పూజ్యుండౌ యె¬వావైరి-బూని సంహరించును
అభయ - మభయ - మభయ‖ దేవుఁడే ‖
Verse
విల్లు విఱచు నాయన తెగ - బల్లెము నఱకు నాయన
చెల్లచెదరు జేసి రిపుల - నెల్లద్రుంచు నాయనే
అభయ- మభయ - మభయ‖ దేవుఁడే ‖