Verse
దేవుడొక నగరము మన కొరకై
సిద్ధపరచుచుండె నుండుటకై‖ 2x ‖
మనము వెళ్ళెదం నిశ్చయముగా‖ 2x దేవుడొక ‖
Verse
మేలిమి బంగారము అద్భుత నగరం
విలువైన రాళ్ళతో పునాది వేసెను‖ 2x ‖
రక్తముచే శుద్ధులై క్షమించబడితిమి‖ 2x ‖
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా‖ 2x దేవుడొక ‖
Verse
నగర ప్రాకారములు ఎత్తైనవి
సూర్య కాంతములచే కట్టబడెను‖ 2x ‖
ప్రభువే విమోచించి అధికారమిచ్చెను‖ 2x ‖
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా‖ 2x దేవుడొక ‖
Verse
ముత్యాల గుమ్మములు పండ్రెండు గలవు
పన్నిద్దరు దూతలు అచ్చట నుండిరి‖ 2x ‖
పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు‖ 2x ‖
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా‖ 2x దేవుడొక ‖
Verse
ఆ నగర వీధులు మేలిమి బంగారం
ద్వారములు ఎప్పటికి మూయబడవు‖ 2x ‖
ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవంబుతో‖ 2x ‖
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా‖ 2x దేవుడొక ‖
Verse
గొర్రెపిల్ల సింహాసన మచ్చటుండును
ఆయనే దీపము నాలయమై యుండును‖ 2x ‖
జీవగ్రంథమందున పేరులున్నవనుచు‖ 2x ‖
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా‖ 2x దేవుడొక ‖
Verse
జయవంతుల కొరకే ఆ నగరం
పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరరు‖ 2x ‖
విజయుల మౌదము క్రీస్తుని రక్తముచే‖ 2x ‖
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా‖ 2x దేవుడొక ‖