Verse
దేవుడు దేహమును పొందిన దినము
మనిషిగా మారి ఇల చేరిన క్షణము‖ 2x ‖
తార వెలిగెను – దూత పాడెను
పరలోకనికి మార్గము వెలిసెను‖ 2x ‖
స్తుతుల గానములు పాడి పరవశించెదము
యేసు నామమునే చాటి మహిమ పరిచెదము‖ 2x ‖
Verse
దూత పలికెను భయము వలదని
తెలిపే వార్తను యేసే క్రీస్తని‖ 2x ‖
చీకటి తొలగెను రారాజుకు భయపడి
లోకము వెలిగెను మరణము చెరవిడి‖ 2x ‖
క్రీస్తు పుట్టెనని తెలిపి సంతోషించెదము
నిత్య జీవమునే చాటి ఘనత పొందెదము‖ 2x Devudu ‖
Verse
సృష్టి కారుడు అల్పుడాయెను
అది శాపము తీయ వచ్చెను‖ 2x ‖
పాపము ఎరుగని మనిషిగా బ్రతికెను
మానవ జాతికి మార్గమై నిలిచెను‖ 2x ‖
నమ్మి ఒప్పినను చాలు తొలగు పాపములు
పరము చేరుటకు మనకు కలుగు దీవెనలు‖ 2x Devudu ‖