Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devudu Deniki Shilpiyunu Nirmanakudai Unnado

దేవుడు దేనికి శిల్పియును నిర్మాణకుడై యున్నాడో

Devudu Deniki Shilpiyunu Nirmanakudai Unnado

Verse 1
Reference: ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను. హెబ్రీయులకు Hebrews 11:10
Chorus
దేవుడు దేనికి శిల్పియును నిర్మాణకుడై యున్నాడో
ఆ పట్టణమే నా గురి - నా జీవితకాలమంతా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ‖ 4x ‖
Verse
నా ప్రభు నన్ను ప్రేమించెన్ నాకై సిలువలో మరణించెన్
తన రక్తములో నను కడిగెన్ నా పాపమును తొలగించెన్
Verse
ప్రతి క్షణము కృపనిచ్చున్ ప్రతి దినము ప్రభు నడిపించున్
ప్రతి వరము ప్రభు మనకిచ్చున్ అతి ఫలము ప్రభు దయచేయున్
Verse
జలములు నాపై లేచినను జలము లపై నే వెళ్ళెదను
జనములు నన్నెదిరించినను జయశాలి ప్రభు జయమిచ్చున్
Verse
ప్రభు నాకిచ్చిన కార్యమును ప్రభు శక్తితో నే జేసెదను
ప్రబు నాకిచ్చిన కాలమును ప్రభు కొరకై నే గడిపెదను
Verse
నిశ్చలమైనది పట్టణము నీతితొ నిండిన పట్టణము
నిత్యము జీవించెదనచట నిత్యుండగు ప్రభు సన్నిధిలో

Related Tags

FaithHeavenEternal CityAbraham