Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devudu Ledani Vaadhamulendhuku

దేవుడు లేడని వాదములెందుకు

Devudu Ledani Vaadhamulendhuku

Lyricist: Jasper Kunapo
Verse
దేవుడు లేడని వాదములెందుకు
వెర్రితనమది అర్థము లేనిది
పాపము చేయుచు పరుగిడుచుంటివా
దేవుని ఉనికిని చంపుచు మదిలో
శ్రేష్టమైనది సృష్టంతయును
సౌఖ్యములతో భూమిని మనకొసగె
సృష్టిని చూడగా కర్తయు కనపడే
దృష్టితో దేవుని కనుగొనుమా
మన మనః సాక్షియే దేవుని తెలుపగ
మంచి చెడులు మనిషికి తెలిసెను
మరచిపోకుమా మోసపోకుమా
మనుగడ దేవుని కృపయే సుమా
ప్రాణము పోయేడి స్థితి మనకొచ్చినా
ప్రభువా ప్రభువని పిలువక తప్పునా
వట్టి మాటలు కట్టిపెట్టుమిక
చివరకు దేవుడే దిక్కు సుమా
క్రీస్తుని జననము, పునరుత్థానము
జరిగిన అద్భుత కార్యములెన్నో
కట్టు కథలివా ? కొట్టి వేయుటకు
వ్రాసిన చరితమే నిజము సుమా!
దేవుని మాటలే బైబిలు గ్రంధము
దానిలో దేవుడే జీవము నిచ్చును
యేసుని రక్తమే పాపికి శరణము
ఎంతో మేలది గైకొనుమా

Related Tags

GospelRepentanceCreation