Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devudu Lokamunu

దేవుడు లోకమును

Devudu Lokamunu

Verse
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను‖ 2x ‖
నిన్ను నన్ను ధరలో ప్రతి వారిని‖ 2x ‖
ఎంతో ప్రేమించెను ప్రేమించి ఏతెంచెను‖ దేవుడు ‖
Verse
పరలోక ప్రేమ ఈ ధరలో
ప్రత్యక్షమాయె ప్రతివానికై‖ 2x ‖
ఆదియందున్న ఆ దేవుడు
ఏతెంచె నరుడై ఈ భువికి‖ 2x ‖
ఈ ప్రేమ నీ కొరకే – జన్మించే ఇల యేసు నీ కొరకే‖ 2x దేవుడు ‖
Verse
పాపంధకారములో అంధులుగా
చీకటి త్రోవలో తిరుగాడగా‖ 2x ‖
జీవపు వెలుగైన ఆ ప్రభువు
వెలిగించగా వచ్చెను ప్రతి వారిని‖ 2x ‖
ఈ వెలుగు నీ కొరకే – యేసు నిన్నిల వెలిగించును‖ 2x దేవుడు ‖

Related Tags

PraiseGospelLove