Chorus
దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు
మా దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు
జీవగల దేవుని సైన్యముగా - సాతాను నోడింతుము‖ 2x ‖
యుద్ధం యెహోవాదే - రక్షణ యెహోవాదే
విజయం యెహోవాదే - ఘనత యెహోవాదే‖ 2x ‖
దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు
మా దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు
Verse
మా దేవుని బాహువే - తన దక్షిణ హస్తమే
ఆయన ముఖ కాంతియే - మాకు జయమిచ్చును‖ 2x ‖
తనదగు ప్రజగా మము రూపించి - నిరతము మాపై కృప చూపించి
తన మహిమకై మము పంపించి - ప్రభావమును కనపరుచును
Chorus
యుద్ధం యెహోవాదే - రక్షణ యెహోవాదే
విజయం యెహోవాదే - ఘనత యెహోవాదే‖ 2x ‖
దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు
మా దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు
Verse
మా దేవుని ఎరిగిన - జనులముగా మేమందరం
బలముతొ ఘనకార్యముల్ - చేసి చూపింతుము‖ 2x ‖
దేవునిచే సూర క్రియలను చేసి - భూమిని తలక్రిందులుగా చేసి
ఆయన నామము పైకెత్తి - ప్రభు ధ్వజము స్థాపింతుము
Chorus
యుద్ధం యెహోవాదే - రక్షణ యెహోవాదే
విజయం యెహోవాదే - ఘనత యెహోవాదే‖ 2x ‖
దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు
మా దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు