Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devudu Manaku Ellappudu

దేవుడు మనకు ఎల్లప్పుడు

Devudu Manaku Ellappudu

Lyricist: Songs Of Zion
Verse
దేవుడు మనకు ఎల్లప్పుడు‖ 2x ‖
తోడుగ నున్నాడు‖ 3x ‖
Verse
ఏదేనులో ఆదాముతో నుండెన్‖ 2x ‖
హానోకు తోడనేగెను‖ 2x ‖
దీర్ఘ దర్శకులతో నుండెన్‖ 2x ‖
ధన్యులు దేవుని గలవారు – తోడుగనున్నాడు
Verse
దైవాజ్ఞను శిరసావహించి‖ 2x ‖
దివ్యముగ నా బ్రాహాము‖ 2x ‖
కన్న కొమరుని ఖండించుటకు‖ 2x ‖
ఖడ్గము నెత్తిన యపుడు – తోడుగనున్నాడు
Verse
యోసేపు ద్వేషించ బడినపుడు‖ 2x ‖
గోతిలో త్రోయబడినపుడు‖ 2x ‖
శోధనలో చెరసాలయందు‖ 2x ‖
సింహాసనమెక్కిన యపుడు – తోడుగనున్నాడు
Verse
ఎర్ర సముద్రపు తీరమునందు‖ 2x ‖
ఫరో తరిమిన దినమందు‖ 2x ‖
యోర్దాను దాటిన దినమందు‖ 2x ‖
యెరికో కూలిన దినమందు – తోడుగనున్నాడు
Verse
దావీదు సింహము నెదిరించి‖ 2x ‖
ధైర్యాన చీల్చినయపుడు‖ 2x ‖
గొల్యాతును హతమార్చినయపుడు‖ 2x ‖
సౌలుచే తరుమబడినపుడు – తోడుగనున్నాడు
Verse
సింహపు బోనులో దానియేలు‖ 2x ‖
షద్రకు మేషా కబేద్నెగో‖ 2x ‖
అగ్ని గుండములో వేయబడెన్‖ 2x ‖
నల్గురిగా కనబడినపుడు – తోడుగనున్నాడు
Verse
పౌలు బంధించబడినపుడు‖ 2x ‖
పేతురు చెరలో నున్నపుడు‖ 2x ‖
అపోస్తలులు విశ్వాసులు‖ 2x ‖
హింసించ బడినయపుడు – తోడుగనున్నాడు‖ దేవుడు ‖

Related Tags

PraiseFaithfulnessGod