Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devudu Manaku Ellappudu Thoduganu

దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగను

Devudu Manaku Ellappudu Thoduganu

Verse
దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు‖ 3x ‖
Verse
ఏదేనులో ఆదాముతో నుండెన్ హానోకుతోడ నేగెను
దీర్ఘ దర్శకులతో నుండెన్ ధన్యులు దేవుని గలవారు‖ తోడుగ ‖
Verse
దైవజ్ఞాను శిరసావహించి దివ్యముగ నబ్రాహాము కన్న
కొమరుని ఖండించుటకు ఖడ్గము నెత్తినయపుడు‖ తోడుగ ‖
Verse
యోసేపు ద్వేషించబడినపుడు గోతిలో త్రోయబడినపుడు
శోధనలో చెరసాల యందు సింహాసన మెక్కినయపుడు‖ తోడుగ ‖
Verse
ఫరోరాజు తరిమిన యపుడు ఎర్రసంద్రపు తీరమున
యోర్దానునది దాటినపుడు ఎరికో కూలినయపుడు‖ తోడుగ ‖
Verse
దావీదు సింహాము నెదరించి ధైర్యాన చీల్చిన యపుడు
గొల్యాతును హతమార్చినపుడు సౌలుచే తరుమబడి నపుడు‖ తోడుగ ‖
Verse
సింహపుబోనులో దానియేలు షద్రకు మేషాకబెద్నెగో
అగ్ని గుండములో వేయబడున్ నల్గురుగా కనబడినపుడు‖ తోడుగ ‖
Verse
పౌలు బంధించబడినపుడు పేతురు చెరలోనున్నప్పుడు
అపోస్తలుల విశ్వాసులు హింసింపబడిన యపుడు‖ తోడుగ ‖

Related Tags

FaithGuidanceGod