Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devudu Manaku Ellappudu Toduga Nunna

దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగ నున్నా

Devudu Manaku Ellappudu Toduga Nunna

Verse 1
దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగ నున్నాడు‖ 2x ‖
Verse
ఏదెనులో ఆదాముతోనుండెన్‌ హానోకుతోడ నేగేను
ధీర్గదర్శకులతో నుండెను ధన్యులు దేవుని గలవారు
Verse
దైవాజ్ఞను శిరసావాహించి దివ్యముగ నబ్రాహము
కన్న కుమరుని ఖండించుటకు ఖడ్గమునెత్తిన యపుడు
Verse
యేసేపు ద్వేషించబడి నపుడు గోతిలో త్రోయ బడినపుడు
శోధనలో చెరసాలయందు సింహాసన మెక్కిన యపుడు
Verse
ఫరోరాజు తరిమిన యపుడు ఎర్రసముద్రపు తీరమున
యోర్దాను నది దాటినపుడు ఎరికో కూలినా యపుడు
Verse
దావీదు సింహము నెదిరించినపుడు దైర్యముగ, చీల్చీనపుడు
గొల్యాతును హతమార్చినపుడు సౌలుచే తరమ బడినపుడు
Verse
సింహపు బోనులో దానియేలు షడ్రకు,మేషకు, అబెద్నెగో
అగ్ని గుండములో వేయబడెన్‌ నల్గురుగా కనబడినపుడు
Verse
పౌలు బంధించబడినపుడు పేతురు చెరలో నున్నపుడు
అపొస్తులులు విశ్వాసులు హింసించాబడిన యపుడు

Related Tags

FaithfulnessGods Presence