Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devudu Meeku Ellappudu Thodugannunnadu

దేవుడు మీకు ఎల్లప్పుడు తోడుగనున్నడు

Devudu Meeku Ellappudu Thodugannunnadu

Chorus
దేవుడు మీకు ఎల్లప్పుడు
తోడుగనున్నడు ...‖ 3x ‖
Verse
ఏదేనులో ఆదాముతో నుండెన్
హానోకు తోడనేగెను దీర్ఘ దర్శకులతో నుండెన్
ధన్యులు దేవుని గలవారు - తోడుగనున్నడు
Verse
దైవాజ్ఞను శిరసావాహించి దివ్యముగ నా బ్రాహాము
కన్న కొమరుని ఖండించుటకు
ఖడ్గము నెత్తిన యపుడు - తోడుగనున్నడు
Verse
యోసేపు ద్వేశించ బడినపుడు
గోతిలో త్రోయబడినపుడు శోధనలో చెఱసాలయందు
సింహాసన మెక్కినయపుడు - తోడుగనున్నడు
Verse
ఎర్ర సముద్రపు తీరమునందు ఫరోతరిమిన దినమందు
యోర్దాను దాటిన దినమందు
యెరికో కూలిన దినమందు - తోడుగనున్నడు
Verse
దావీదు సింహము నెదిరించి ధైర్యాన చీల్చినయపుడు
గొల్యాతును హతమార్చినయపుడు
సౌలుచే తరుమబడినపుడు - తోడుగనున్నడు
Verse
సింహపు బోనులో దానియేలు షద్రకు మేషా కబేద్నెగో
అగ్ని గుండములో వేబడెన్
నల్గురిగా కనబడినపుడు - తోడుగనున్నడు
Verse
పౌలు బంధించబడినపుడు పేతురు చెరలో నున్నప్పుడు
అపోస్తలులు విశ్వాసులు
హింసించ బడినయపుడు - తోడుగనున్నడు

Related Tags

FaithfulnessGods Presence