Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devudu Neeku Thelusu

దేవుడు నీకు తెలుసు

Devudu Neeku Thelusu

Verse
దేవుడు నీకు తెలుసు – నీవు దేవునికి తెలుసా
నీవు దేవుని నమ్మినా – నిన్ను దేవుడు నమ్మాలి‖ 2x ‖
అవసరాలకు దేవుని నమ్మక
ఆత్మకు తండ్రని నమ్మాలి‖ 2x ‖
నీ ఆత్మకు తండ్రని నమ్మాలి‖ దేవుడు ‖
Verse
నాలుగు గోడల మధ్య నీవు నలిగిపోక
నలు దిక్కులకు సువార్తను ప్రకటించు‖ 2x ‖
ప్రభువా ప్రభువని పిలువక – ప్రార్ధనతో విసిగించక
పాపిని రక్షించు పరలోకానికి నడిపించు
నా నిమిత్తము ఎవడు పోవునని అడుగుచున్నాడు దేవుడు
నా అవసరత తీర్చమని అడుగుచున్నాడు క్రైస్తవుడు‖ దేవుడు ‖
Verse
నామకార్ధ భక్తి దేవునికే అది విరక్తి
సువార్త భారం కలిగి నీవు బ్రతికితేనే ముక్తి‖ 2x ‖
ప్రజలందరికి ఇదే బైబిల్ సూక్తి‖ 2x ‖
దేవుని చేయి వెతకకుంటే అగ్నితోనే శాస్తి‖ 2x ‖
దేవునికిష్టమైనది తెలుసుకోవాలి ముందు
దేహానికిష్టమైనది అడగకూడదు ముందు‖ దేవుడు ‖

Related Tags

FaithRepentanceDevotion