Chorus
దేవుఁ డిచ్చిన దివ్యవాక్య మి దేను మన కో యన్నలారా భావ శుద్ధిని
జేయు ఘన శుభ వర్తమానము దీని పేరు‖ దేవుఁ డిచ్చిన ‖
Verse
భయముతో భక్తితోఁ జదివినఁ ప్రాపు క్రీస్తుఁ డటంచుఁ దెల్పును
దయా మయుఁడగు దేవుఁడే మన తండ్రి యని బోధించు నెల్లెడ‖ దేవుఁ డిచ్చిన ‖
Verse
సత్యశాంతము లంకురించును సత్క్రియా ఫలములును బొడమును
నిత్యజీవము గలుగు దానన్ నిస్సందేహముగ నుండును‖ దేవుఁ డిచ్చిన ‖
Verse
ఈ సుమంగళ దివ్యవాక్యము నిప్పుడే మీ రనుసరించుఁడు దోసములు
నెడబాసి మోక్షపుఁ ద్రోవఁ గోరిన వారలెల్లరు‖ దేవుఁ డిచ్చిన ‖
Verse
పాపములలో నుండి విడుదలఁ పరమ సుఖ మని దలఁతు రేనియుఁ
తాప మార్పును లేచి రండి త్వరగఁ క్రీస్తుని శరణు బొందను‖ దేవుఁ డిచ్చిన ‖
Verse
దురిత ఋణములు దీర్చు మధ్య స్థుండు గావలె నన్న వారలు త్వరగ
రండీ త్వరగ రండీ వరదుడౌ క్రీస్తు కడ కిపుడె‖ దేవుఁ డిచ్చిన ‖
Verse
మరణమునకై భయము నొందెడి మానసము గల వార లెల్లరు పరమ
శాంతి యొసంగు క్రీస్తుని పజ్జ డాయఁగ రండి వేగము‖ దేవుఁ డిచ్చిన ‖
Verse
నిర్మలాంతఃకరణ సౌఖ్యము నిజముగా నిలవెదకువారు ధర్మచిత్తుండైన
క్రీస్తుని దరికి రండి రండి వేగము‖ దేవుఁ డిచ్చిన ‖
Verse
మోక్ష రాజ్యముఁ జేరఁ గోరెడు బుద్ధి గలిగిన వార లెల్లరు రక్ష కుండగు
యేసు నొద్దకు రండి రండి విశ్వసించుచు‖ దేవుఁ డిచ్చిన ‖