Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devundavaina Aathma Raa Nee Vaari Na

దేవుండవైన యాత్మ రా నీ వారి న

Devundavaina Aathma Raa Nee Vaari Na

Lyricist: Martin Luther
Verse
దేవుండవైన యాత్మ! రా
నీ వారి నీవు ప్రీతిగా
నీ సత్కృపావరంబు నీ
నీ ప్రేమ గుమ్మరింపుమీ.
Verse
సమస్త భూ జనంబులు
సద్దేవు విశ్వసింపను
నీ దివ్య వాక్య కాంతితో
నిత్యంబు వారి బిల్తువు.
Verse
దేవా! విశుద్ధ తేజమా!
జీవంపు వాక్య మిమ్మయా
మా తండ్రియంచు బిల్వను
మా దేవుదెల్పి నేర్పుము.
Verse
దుర్భోధ చేయువారిని
దూరంబునందు నుంచుమీ
మా యేసు క్రీస్తు డొక్కడే
ఓదార్చు బోధ కుండిలన్.
Verse
ఓ దివ్య ప్రేమ! యూరటా
మోదంబుతోడ మమ్ముల
నీదైవ సేవ చేయనీ
నాధుండ!! హింస లోర్వనీ
Verse
జీవించి యున్న జచ్చినన్
జీవాత్మముక్తి పొందగన్
మా కిమ్ము నీ బలంబును
నమ్మిక గట్టి బర్చుము, ఆమేన్

Related Tags

WorshipHoly Spirit