Verse
దేవుని ఆనందం నిను కమ్మును
ఉన్నతమైన స్థలములు నిను ఆహ్వానించున్‖ 2x ‖
Verse
పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను
ఆకాశపు వాకిళ్లు తెరుచును నీకు‖ 2x ‖
Chorus
నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు‖ 2x ‖
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు‖ 2x ‖
Verse
బాధించు బంధకములు ఈ దినమే విప్పబడున్
నీ ముందు అడ్డుగా నిలిచే సంకెళ్లు తెగిపడున్‖ 2x ‖
నీకున్న దర్శనం నెరవేర త్వరపడున్
అనుకూల ద్వారములు నీ కొరకు తెరవబడున్‖ 2x ‖
Chorus
నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు‖ 2x ‖
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు‖ 2x ‖
Verse
నీతి సూర్యుడు నీ పైన ఉదయించును
యేసుని రెక్కల క్రింద ఆరోగ్యమొందెదవు‖ 2x ‖
నీ కాలి క్రింద దుష్టుడు ధూళిగా మారును నింగిలో మెరుపు వలె శత్రువు కూలును‖ 2x ‖
Chorus
నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు‖ 2x ‖
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు‖ 2x ‖