Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devuni Goppa Mahimanu

దేవుని గొప్ప మహిమను

Devuni Goppa Mahimanu

Lyricist: Sayaram Gattu
Verse
దేవుని గొప్ప మహిమను చూసి తిరిగి పాపం చేసెదవా?
ద్వంద నీతికి నిష్కృతి లేదని నీకు తెలుసా ఓ క్రైస్తవా!‖ 2x ‖
ఎంత అధము అన్యుల కన్న, ఎంత ఘోరము ఆ యూద కన్న
వలదు పాపం ఇకపైనన్న, తిరిగి పొందు క్రీస్తులో మన్నా‖ 2x ‖
Verse
మరచినవా నీ అపజయములు
గుర్తు లేదా! ఆ శోధనలు
నీవు చూపిన ఆ వినయములు
ఏడ్చి చేసిన ఆ ప్రార్థనలు
తండ్రి నీవే దిక్కంటూ, మోకరిల్లిన ఆ క్షణము
అందుకొంటివి విజయములు, విడిచి పెడితివి వాక్యములు‖ 2x ఎంత ‖
Verse
అందుకొంటివి బాప్తిస్మమును
పొందు కొంటివి ఆ రక్షణను
వదలబోకు ఆత్మీయతను
చేరనివ్వకు నిర్లక్ష్యమును
తీర్పు తీర్చే సమయంలో ఓర్పు దొరకదు గుర్తెరుగు
నిత్య జీవం లో నుండి, ఘోర నరకం చేరెదవా?‖ 2x ఎంత ‖

Related Tags

RepentanceChristian LifeCorrection