Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devuni Goppa Premanu Kalambu

దేవుని గొప్ప ప్రేమను కలంబు

Devuni Goppa Premanu Kalambu

Lyricist: A B Masilamani
Verse
దేవుని గొప్ప ప్రేమను
కలంబు తెల్పజాలదు
అత్యున్నత నక్షత్రమున్
అధోగతిన్ అవరించున్
నశించు జాతిన్ రక్షింపన్
సుతుని బంపెను
పాపంబు నుండి పాపికి
విశ్రాంతి జూపెను
||దేవుని ప్రేమ సంపద‖ దేవుని ప్రేమ సంపద ‖
అపారమైనది
నిరంతరంబు నిల్చును
ప్రేమ సంగీతము||
Verse
యుగాంతకాల మందున
భూరాజ్యముల్ నశించగా
యేసున్ నిరాకరించువారు
చావును కోరు వేళను
దేవుని ప్రేమ గెల్చును
అనంత జీవము
నశించు వారి కాశ్రయంబు
ప్రేమ సందేశము.
Verse
సముద్రమును సిరాతో నిండి
ఆకాశమె కాగితమై
కొమ్మల్లె కలంబులె
ప్రతి నరుండు కరణమై
దేవుని ప్రేమన్ చిత్రింపన్
సంద్రంబు యింకును
ఆకాశ వ్యాప్తి యంతయు
చాలక పోవును.

Related Tags

PraiseLove Of God