Chorus
దేవుని గ్రంధము దినదినము చదువుము పావనమార్గము జీవము
సత్యము‖ దేవుని ‖
Verse
ఎంచి తలంచుము మించిన గ్రంథము అంచితముగను రెం డంచుల
ఖడ్గము‖ దేవుని ‖
Verse
తేనియమధురము తినుము ప్రతిదినము ధ్యానముసేయుము దానన
బ్రదుకుము‖ దేవుని ‖
Verse
నాధుని వాక్యము అరయుము భాగ్యము పాదపు దీపము భక్తుల
కవచము‖ దేవుని ‖
Verse
ఆత్మల శాంతము అభయము శ్రేయము ఆత్మలకు బలము అనయము
సౌఖ్యము‖ దేవుని ‖
Verse
పాపము శాపము పలువిధతాపము పాపును వేగము దాపున
జేరుము‖ దేవుని ‖
Verse
మదినిది నిరతము పదిలము చేయుము సదమల జ్ఞానము సవిధము
మోక్షము‖ దేవుని ‖