Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devuni Keerthinchedamu Daivaputhruni Naamamandhu

దేవుని కీర్తించెదము దైవపుత్రుని నామమందు

Devuni Keerthinchedamu Daivaputhruni Naamamandhu

Chorus
దేవుని కీర్తించెదము - దైవపుత్రుని నామమందు
Verse
యోసేపుపై దృష్టినుంచి మోసపు చెరనుండి గాచి
యేసునం దైగుప్తు నుండి క్రీస్తునందరిని గాచిన
Verse
పాప ఋణముచెత నిత్య కోపమునకు గురియైతిమి
శాపగ్రాహియై శ్రీ యేసు పాప ఋణమును తీర్చినాడు
Verse
మార్గ సత్య జీవమై నిత్య మరణ భయము లేనివాడు
మరణ బంధితులను గావ మరణమొంది లేచినాడు
Verse
నీతిమంతుడైన యేసు నీతి కార్యములను జేసి
నీతి నిలయుండై తండ్రి నిల నీతితోనే తృప్తిపరచెన్
Verse
యేడ్చెను మన పాపములకై కార్చెను తనరక్తము నిల
ఓర్చెను తన శత్రువులను గెల్చెను తన సిలువతోనే
Verse
లేదు నీకు భయము చింత లేదు నమ్మి నిలచినతో
నీదు స్వాస్థ్యమంత తిరిగి నాథుడేసులో పొందగలవు
Verse
జయము పాడు ప్రియుడ లేచి జయ జీవితము నొంది వేగ
జయశీలుండు కీస్తు యేసుని జయము పాడు హల్లెలూయ

Related Tags

PraiseThanksgiving