Verse 1
Reference: పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై ... దిగి వచ్చుట నాకు చూపెను ప్రకటన Revelation 21:10
Chorus
దేవుని మహిమ మందిరం - యాజకుల ఆరధనాలయం
Verse
అదియే మోరియా గొల్గొతాకొండయు
ఇస్సాకు బల్యర్పణ స్థలమును
యెబూసీ యెరూషలేమదే
Verse
యాకోబు బలిష్టుని నివాసమదియే
ఆస్థలమెంతో భీతి గొల్పునది
పరలోకపు గవినీయదే
Verse
సీనాయి కొండపై మోషేకు చూపిన
పరలోక ప్రత్యక్షపు గుడారమదియే
అగ్నివంటి ఆకారమున్న స్థలమదే
Verse
దావీదు దేవుని గుడారమదియే
తేజోమహిమ నిలుచు నివాసము
ప్రభుని ప్రతిష్ఠిత పర్వతమదియే
Verse
యెహోవా పట్టణము పాదపీఠ స్థలము
ఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోనదియే
చిగురు మహిమ భూషణమగునచట
Verse
సజీవరాళ్ళతో నిర్మించబడుచున్న
యేసుని మానస మందిరమదియే
పెండ్లికుమార్తె సంఘము అదియే
Verse
కలహించుట మాని కలిసి వెళ్ళుదము
హెబ్రోను దేవుని మహిమ మందిరముకు
మన్ దుఃఖ దినములు సమాప్తమగును
Verse
మునుపటి మహిమను మించిన మహిమతో
పరలోకము నుండి దిగి వచ్చుచున్న
నూతన యెరూషలేమదే