Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devuni Neethi Prathapam Bhuvi Yesu

దేవుని నీతి ప్రతాపం భువి యేసు

Devuni Neethi Prathapam Bhuvi Yesu

Lyricist: A B Masilamani
Verse
దేవుని నీతి ప్రతాపం
భువి యేసుని సిల్వ ప్రభావం
దేవుల దేవుని అపురూపం
భువి యేసుని నామ స్వరూపం
దేవ యెహోవ సువాక్యం
-సౌభాగ్యం
దైవ జనుల హృదయానందం.‖ యేసుక్రీస్తు ‖
యేసుక్రీస్తు దైవ సుతుండు
యేసుక్రీస్తు మనుజసుతుండు
యేసుక్రీస్తు దేవుండు
యేసే ప్రభువు
-స్తుతిపాత్రుడు
Verse
ఆద్యంత రహిత కీర్తి
అవతార శ్రమార్జన మూర్తి
ఆకస రాసుల ఆదిపతి
అవనీ సృజనాత్మ ప్రతీతి
అఖిల ప్రపంచ ప్రదాత - అధినేత
అనుదిన కృపాలిడు సుఖదాత.
Verse
పాపము భయపడు నామం
పాపాత్ముడు కృపగను హోమం
పతితుల వెదకిన ప్రేమస్వరం
పరలోక సుఖాల విహారం
పాప క్షమాపణ గానం - బహు
అనవరతము నిజబలిదానం. [మానం
Verse
జనముల జీవాధిపతి
జగమంతటి నేలెడిజ్యోతి
జీవుల అంతిమ న్యాయపతి
జీవాత్ములు క్రోలెడి నీతి
జనన మరణ జయశీల - నరపాల
జగతిని మార్చెడి శుభజ్వాల.

Related Tags

PraiseWorshipJesus