Chorus
దేవుని ప్రేమ - దేవుని ప్రేమ - శాశ్వతమైన ప్రేమ‖ 2x ‖
నిన్నా నేడూ ఎల్లపుడూ - మారని యేసు ప్రేమ‖ 2x ‖
Verse
ప్రతిదినం ప్రత్యేకముగా - కాచి కాపాడే ప్రేమ
అన్నివేళలలో నన్ను - లాలించే దివ్య ప్రేమ
ఆశీర్వదించే ప్రేమా - ఆదరణ చూపే ప్రేమా‖ 2x ‖
Verse
తల్లిదండ్రులు విడచినా - వీడని నా యేసు ప్రేమ
ఎన్ని బాధలు కలిగినా - నాకు తోడుగా నిలిచే ప్రేమ
నన్ను నడిపించే ప్రేమా - నా యేసు క్రీస్తుని ప్రేమా‖ 2x ‖