Verse
దేవుని ప్రేమ యిదిగో జనులార భావంబునం దెలియరే కేవలము
నమ్ముకొనినఁ పరలోక జీవంబు మన కబ్బును‖ దేవుని ‖
Verse
సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతోఁ జేసెను
సర్వోపకారుడుండే మన మీద జాలిపరుఁడై యుండెను‖ దేవుని ‖
Verse
మానవుల రక్షింపను దేవుండు తన కుమారునిఁ బంపెను మన
శరీరముఁ దాల్చెను ఆ ప్రభువు మన పాపమునకు దూరుఁడే‖ దేవుని ‖
Verse
యేసుక్రీస్తను పేరున రక్షకుఁడు వెలసి నాఁడిలలోపల దోసకారి జనులతో
నెంతోను భాషలను బల్కినాఁడు‖ దేవుని ‖
Verse
పాపభారంబు తోడ నే ప్రొద్దు ప్రయాసములఁ బొందెడి పాపులందఱు
నమ్మిన విశ్రాంతి పరిపూర్ణమిత్తు ననెను‖ దేవుని ‖
Verse
సతులైన పురుషులైనన్ యా కర్త సర్వ జనుల యెడలను సత్ప్రేమగ
నడిచెను పరలోక సద్బోధలిక జేసెను‖ దేవుని ‖
Verse
చావు నొందిన కొందఱిన్ యేసుండు చక్కఁగా బ్రతికించెను సకల
వ్యాధుల రోగులు ప్రభు నంటి స్వస్థంబు తా మొందిరి‖ దేవుని ‖
Verse
గాలి సంద్రపు పొంగులన్ సద్దణపి నీళ్లపై నడచినాఁడే మేలు గల
యద్భుతములు ఈలాగు వేలకొలఁదిగ జేసెను‖ దేవుని ‖
Verse
చేతుల కాళ్లను రా రాజు చేర మేకులు బొందెను పాతకులు
గొట్టినారే పరిశుద్ధ నీతి తా మోర్వలేకన్‖ దేవుని ‖
Verse
ఒడలు రక్తము గారఁగ దెబ్బలు చెడుగు లందఱుఁ గొట్టిరి వడిముళ్లు
తలమీఁదను బెట్టిరి ఓర్చెనో రక్షకుండు‖ దేవుని ‖
Verse
ఇన్ని బాధలు బెట్టుచుఁ దనుఁ జంపు చున్న పాప నరులను
మన్నించు మని తండ్రిని యేసుండు సన్నుతితో వేఁడెను‖ దేవుని ‖
Verse
రక్షకుడు శ్రమఁ బొందఁగా దేశంబు తక్షణము చీఁక టయ్యెన్
రక్షకుఁడు మృతి నొందఁగఁ తెర చినిఁగి రాతి కొండలు పగిలెను‖ దేవుని ‖
Verse
రాతి సమాధిలోను రక్షకుని నీతిగల దేహంబును పాఁతి పెట్టిరి
భక్తులు నమ్మిన నాతు లందఱుఁ జూడఁగా‖ దేవుని ‖
Verse
మూఁడవ దినమందున యేసుండు మృతి గెల్చి లేచినాఁడు నాఁడు
నమ్మిన మనుజులు చూచిరి నలువది దినములందున్‖ దేవుని ‖
Verse
పదునొకండు మారులు వారలకుఁ బ్రత్యక్షుఁ డాయె నేను పర
లోకమున కేగెను తన వార్తఁ బ్రకటించు మని పల్కెను‖ దేవుని ‖
Verse
నమ్మి బాప్తిస్మమొందు నరులకు రక్షణ మరి కల్గును నమ్మ నొల్లక
పోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను‖ దేవుని ‖