Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devuni Premaidhigo Janulaara Bhaavambunandheliyare

దేవుని ప్రేమఇదిగో జనులారా భావంబునందెలియరే

Devuni Premaidhigo Janulaara Bhaavambunandheliyare

Chorus
దేవుని ప్రేమఇదిగో - జనులారా భావంబునందెలియరే
కేవలము నమ్ముకొనిన - పరలోక జీవంబు మనకబ్బును‖ దేవుని ‖
Verse
సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో జేసెను
సర్వోపకారుడుండె - మన మీద జాలిపరుడై యుండెను‖ దేవుని ‖
Verse
మానవుల రక్షింపను దేవుండుతన కుమారుని బంపెను మన
శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపములకు దూరుడే‖ దేవుని ‖
Verse
యేసు క్రీస్తును పేరున రక్షకుడు వెలసినాడిల లోపల దోస
కారిజనులతో - నెంతో సు - భాషలను బల్కినాడు‖ దేవుని ‖
Verse
పాపబారంబుతోడ నేప్రొద్దు - ప్రయాసములు బొందెడి
పాపులందురు నమ్మిన - విశ్రాంతి - పరిపూర్ణ మిత్తుననెను‖ దేవుని ‖
Verse
సత్తులైన పురుషులైనన్‌ - యాకర్త సర్వజనుల యెడలను
సత్ప్రేమగ నడిచెను - పరలోక సద్భోదలిక జేసెను‖ దేవుని ‖
Verse
చావు నొందిక కొందరిన్‌ - యేసుండు - చక్కగ బ్రతికించెను
సకల వ్యాధుల రోగులు - ప్రభునంటి - స్వస్థంబు తా మొందిరి‖ దేవుని ‖
Verse
గాలి సంద్రపు పొంగులన్‌ - సద్ధణపి - నీళ్లపై నడచినాడే
మేలుగల యద్భుతములు ఈలాగు వేలకొలదిగజేసెను‖ దేవుని ‖
Verse
చేతుల కాళ్లలోనూ రా రాజు - చేర మేకులు బొందెను
పాతకులు గొట్టినారే పరిశుద్ధ నీతి తామోర్వ లేకన్‌‖ దేవుని ‖
Verse
ఇన్ని బాధలు బెట్టుచు - దను జంపు - చున్న పాపరులను
మన్నించుమని తండ్రిని యేసుండు సన్నుతితో వేడెను‖ దేవుని ‖
Verse
రక్షకుడు శ్రమబొందగా దేశంబు తక్షణము చీకటియ్యెను
రక్షకుడు మృతి నొందగా - తెర చినిగి - రాతి కొండలు పగిలెను‖ దేవుని ‖
Verse
రాతి సమాధిలోను - రక్షకుని నీతిగల దేహంబును - పాతి
పెట్టిరి భక్తులు - నమ్మిన నాదలందఱు జూడగా‖ దేవుని ‖
Verse
మూడవ దినమందున యేసుండు మృతి గెల్చి లేచినాడు
నాడు నమ్మిన మనుజులు - చూచిరి - నలువది దినములందున్‌‖ దేవుని ‖
Verse
పదినొకండు మారులు వారలకు - ప్రత్యక్షుడాయెనేను
పరలోకమునకేగెను - తన వార్త ప్రకటించమని పల్కెను‖ దేవుని ‖
Verse
నమ్మి బాప్తిస్మ మెందు - నరులకు - రక్షణ మరి కల్గును
నమ్మనొల్లక పోయెడు - నరులకు నరకంబు సిద్ధమనెను‖ దేవుని ‖

Related Tags

GospelSalvationJesus Christ