Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devuni Samukha Jeeva Kavilelo Nee Perunnada

దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నద

Devuni Samukha Jeeva Kavilelo Nee Perunnada

Chorus
దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా. . ఆ. . ఆ. . నీపేరున్నదా
Verse
జీవవాక్యము నిలలో చాటుచు జీవితము లర్పించిరే
హత సాక్షుల కవిలెలోన నీ పేరున్నదా. . ఆ. . ఆ. . నీపేరున్నదా
Verse
ఆకాశమండలములలో తిరిగెడు అందకార శక్తులను గెలిచిన
విజయవీరుల కవిలెలో నీ పేరున్నదా. . ఆ. . ఆ. . నీపేరున్నదా
Verse
పరిశుద్ధ యెరుషలేము సంఖ్య పరిశుద్ధ గ్రంధము సూచించు
సర్వోన్నతుని పురములలో నీ పేరున్నదా. . ఆ. . ఆ. . నీపేరున్నదా
Chorus
దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా. . ఆ. . ఆ. . నీపేరున్నదా
Verse
దేవుని సన్నిధి మహిమ ధననిధి దాతను వేడి వరము పొందిన
ప్రార్ధన వీరుల కవిలెలో నీ పేరున్నదా. . ఆ. . ఆ. . నీపేరున్నదా
Verse
పరమునుండి ప్రభువు దిగగా పరిశుద్ధులు పైకెగయునుగా
పరిశుద్ధుల కవిలెలో నీ పేరున్నదా. . ఆ. . ఆ. . నీపేరున్నదా

Related Tags

HolinessPrayerHeavenSalvation