Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devuni Sannidhilo Sampurna Santosham

దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం

Devuni Sannidhilo Sampurna Santosham

Verse
దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం
ఆ శిలువ నీడలో సంపూర్ణ క్షేమము
నా యేసులో దొరుకునులే నిత్యాజీవము
నా క్రీస్తులో దొరుకునులే నిత్యానందము
Verse
రాజులను అధికారులను నమ్ముకొనుటకంటే
నా యేసుని నమ్ముటలో నా జీవిత ధన్యకరం
నా యేసు సన్నిధి అదే నాకు పెన్నిధి
తోడుగా నీడగా నను నడిపించునులే
జీవము జీవకీరీటము నా యేసులో దొరుకునులే
Verse
కునుకడు నిద్రపోడు నా దేవుడు ఎన్నడు
కంటికి రెప్పవలే ననుకాచి కాపాడును
కరువైన కారు చీకటైనా భయమికలేదులే
కరుణించి తన కృప చూపి నను నడిపించును

Related Tags

WorshipJoyPeace