Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devuni Seeyonu Purama Shreshtama

దేవుని సీయోన్ పురమా శ్రేష్టమ

Devuni Seeyonu Purama Shreshtama

Lyricist: John Newton
Verse
దేవుని సీయోన్ పురమా!
శ్రేష్టమౌ పట్టణమా!
స్థావరంబైన పురమా!
దేవుని నివాసమా!
యుగముల శిలయైన
దేవుడే నీ పునాదీ!
శత్రువు జయించలేని
రక్షణ నీ దుర్గము.
Verse
కాంచుమా సజీవధారల్
శాశ్వత ప్రేమధారల్
నీదు పుత్రికా పుత్రులన్
తృప్తిపర్చు ధారలన్
అలసి సొలయకుండ
దాహమున్ దీర్చుధార
దాతయౌ దేవుని కృప
సర్వకాలంబు పారున్
Verse
కాంచుమా నీ యిండ్లమీద
అగ్ని మేఘంబుల్దిగె
ప్రభుని రాక సమయం
బని మహిమ దెల్ప!
ప్రార్థన ఫలంబులిచ్చి
మన్నా నిచ్చిన ప్రభు
సింహాసనాసీనుడై సు
నాదుస్తోత్రంబుల్ వినెన్

Related Tags

WorshipZionCity Of God