Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devuni Sthuthincha Randi Gatha Samvathsaramuna Kaapaaden

దేవుని స్తుతించ రండి గత సంవత్సరమున కాపాడెన్

Devuni Sthuthincha Randi Gatha Samvathsaramuna Kaapaaden

Verse 1
Reference: యింతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. 1 సమూయేలు Samuel 7:12
Chorus
దేవుని స్తుతించ రండి - గత సంవత్సరమున కాపాడెన్
Pre-Chorus
కీడు మనలను చేరకను - కోటి‖ కోటి ‖
కీడుల నుండి కాపాడినట్టి - మహా‖ మహా ‖
Verse
కోట్లకొలది మరణించిరి మన మిచ్చట చేరియున్నాము
కష్టములబాపి మనల నింక
జగమున జీవితులుగ నుంచినట్టి - మహా‖ మహా ‖
Verse
ఎన్ని కీడుల మనము చేసిన నన్ని మేళ్ళను చెసెనుగా
నిరతము కాచి చక్కగను
ప్రభు ప్రేమతో కాచినందున స్తుతి చేసి
Verse
ఏకముగా పాడి హర్షముతో లెక్కలేని మేలులకై
ఆత్మ దేహములను బలిగ
నిపుడేసు కర్పించెద మేకముగా - చేరి‖ చేరి ‖
Verse
వత్సరారంభమున నిను మేమొక్కటిగా నారాధింప
దైవకుమారా కృపనిమ్ము
మా జీవిత కాలమంతయు పాడి - మహా‖ మహా ‖
Verse
భూమియందలి మాయలనుండి సైతానుని వలలో నుండి
ఆత్మతో నిను సేవింప
నిపు డేలుమనుచు బ్రతిమాలెదము - కూడి‖ కూడి ‖
Verse
ప్రతి సంవత్సరమును మము జూడుము
దుర్గములో మము చేర్చుమయ్యా
దాటునపుడు నీ సన్నిధిని - చూపి‖ చూపి ‖
ధైర్యము నిచ్చి ఓదార్చుమయ్యా - మహా‖ మహా ‖
Verse
స్తోత్రింతుము ప్రభువా నీ పదముల
సకలాశీర్వదముల నిమ్ము
ప్రేమతో ప్రభుతో నుండ
నెట్టి యాపద లేక బ్రోవు మామెన్ - ప్రభు‖ ప్రభు ‖

Related Tags

PraiseThanksgivingNew Year