Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devuni Sthuthiyinchi Aaraadhinthumu

దేవుని స్తుతియించి ఆరాధింతుము

Devuni Sthuthiyinchi Aaraadhinthumu

Lyricist: Madhu
Verse
దేవుని స్తుతియించి ఆరాధింతుము
మన దేవుని ఆరాధించి ఆనందింతుము‖ 2x ‖
రండీ ఓ జనులారా
సర్వలోక నివాసులారా‖ 2x ‖
సంతోషగీతము పాడెదము‖ 2x ‖
ఆహా.. ఆరాధనా.. – హల్లెలూయా ఆరాధనా…‖ 2x దేవుని ‖
Verse
వేటకాని ఉరిలో నుండి ఆయనే నిన్ను విడిపించును
భారమైన నీ బాధలను ఆయనే ఇక తొలగించును‖ 2x ‖
ఏ తెగులు నీ ఇల్లు దరిచేరదు‖ 2x ‖
ఆయనే రక్షించును‖ రండీ ఓ ‖
Verse
బండ చీల్చి నీళ్ళను ఇచ్చి ఇశ్రాయేలీయులను కాచెను
నింగి నుంచి మన్నాను పంపి వారి ప్రాణము రక్షించెను‖ 2x ‖
శత్రువుల చెర నుంచి విడిపించెను‖ 2x ‖
తోడుండి నడిపించెను‖ రండీ ఓ ‖
Verse
మన విరోధి చేతిలోనుండి ఆయనే మనను తప్పించును
కష్టకాల ఆపదలన్ని ఆయనే ఇక కడతేర్చును‖ 2x ‖
వేదనలు శోధనలు ఎదిరించగా‖ 2x ‖
శక్తిని మనకిచ్చునూ‖ రండీ ఓ ‖
Verse
కన్నవారు ఆప్తులకంటే ఓర్పుగా మనను ప్రేమించును
భూమికంటే విస్తారముగా ప్రేమతో మనను దీవించును‖ 2x ‖
ఆ ప్రభువు రక్షకుడు తోడుండగా‖ 2x ‖
దిగులే మనకెందుకు‖ రండీ ఓ ‖

Related Tags

PraiseWorshipJoy