Verse
దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి‖ దేవుని ‖
Verse
ఆయన పరిశుద్ధ ఆలయమందు‖ 2x ‖
ఆయన సన్నిధిలో ఆ… ఆ…‖ 2x ఎల్లప్పుడు ‖
Verse
ఆయన బలమును ప్రసిద్ధి చేయు‖ 2x ‖
ఆకశవిశాలమందు ఆ… ఆ…‖ 2x ఎల్లప్పుడు ‖
Verse
ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి‖ 2x ‖
ఆయన ప్రభావమును ఆ… ఆ…‖ 2x ఎల్లప్పుడు ‖
Verse
బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి‖ 2x ‖
స్వరమండలములతో ఆ… ఆ…‖ 2x ఎల్లప్పుడు ‖
Verse
సన్న తంతుల సితారతోను‖ 2x ‖
చక్కని స్వరములతో ఆ… ఆ…‖ 2x ఎల్లప్పుడు ‖
Verse
తంబురతోను నాట్యముతోను‖ 2x ‖
తంతి వాద్యములతో ఆ… ఆ…‖ 2x ఎల్లప్పుడు ‖
Verse
పిల్లనగ్రోవుల చల్లగనూది‖ 2x ‖
ఎల్లప్రజలు జేరి ఆ… ఆ…‖ 2x ఎల్లప్పుడు ‖
Verse
మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి‖ 2x ‖
గంభీర తాళముతో ఆ… ఆ…‖ 2x ఎల్లప్పుడు ‖
Verse
సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి‖ 2x ‖
హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ…‖ 2x ఎల్లప్పుడు ‖