Chorus
దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు
దేవుని స్తుతియించుడి‖ దే ‖
Verse
ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆ ఆ‖ దే ‖
Verse
ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశవిశాలమందు ఆ ఆ‖ దే ‖
Verse
ఆయన పరాక్రమ కార్యమున్ బట్టి ఆయనప్రభావమును‖ దే ‖
Verse
బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి స్వరమండలముతో ఆ ఆ‖ దే ‖
Verse
సన్నతంతుల సితారతోను చక్కని స్వరములతో‖ దే ‖
Verse
తంబురతోను నాట్యముతోను తంతి వాద్యముతోను ఆ ఆ‖ దే ‖
Verse
పిల్లనగ్రోవులు చల్లగనూది ఎల్లప్రజలు జేరి‖ దే ‖
Verse
మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి గంభీర తాళముతో ఆ ఆ‖ దే ‖
Verse
సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా
ఆమెన్ ఆ ఆ హల్లెలూయా ఆమెన్ ఎల్లప్పుడు‖ దే ‖