Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devuni Sthuthiyinchudi Ellappudu

దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు

Devuni Sthuthiyinchudi Ellappudu

Chorus
దేవుని స్తుతియించుడి! ఎల్లప్పుడు‖ ఎల్లప్పుడు ‖
దేవుని స్తుతియించుడి ఆ .. ఆ ..
Verse
ఆయన పరిశుద్ధ ఆలయమందు - ఆయన సన్నిదిలో
ఆ .. ఆ .. ఆయన సన్నిధిలో - ఎల్లప్పుడు‖ ఎల్లప్పుడు ‖
Verse
ఆయన బలమును ప్రసిద్ది చేయు - ఆకాశ విశాలమందు
ఆ .. ఆ.. ఆకాశ విశాలమందు - ఎల్లప్పుడు‖ ఎల్లప్పుడు ‖
Verse
ఆయన పరాక్రమ కార్యముల బట్టి - ఆయన ప్రభావమును
ఆ..ఆ.. ఆయన ప్రభావమును - ఎల్లప్పుడు‖ ఎల్లప్పుడు ‖
Verse
బూర ధ్వనితో ఆయనను స్తుతియించుడి - స్వరమండలములతో
ఆ...ఆ.. స్వరమండలములతో - ఎల్లప్పుడు‖ ఎల్లప్పుడు ‖
Verse
సన్న తంతుల సితారతోను - చక్కని స్వరములతో
ఆ..ఆ.. చక్కని స్వరములతో - ఎల్లప్పుడు‖ ఎల్లప్పుడు ‖
Verse
తంబురతోను నాట్యముతోను - తంతి వాద్యములతోను
ఆ..ఆ.. తంతి వాద్యములతోను - ఎల్లప్పుడు‖ ఎల్లప్పుడు ‖
Verse
పిల్లన గ్రోవుల చల్లగ నూది - ఎల్ల ప్రజలు జేరి
ఆ..ఆ.. ఎల్ల ప్రజలు చేరి - ఎల్లప్పుడు‖ ఎల్లప్పుడు ‖
Verse
మ్రోగు తాళములతో ఆయనన్ స్తుతియించుడి - గంభీర తాళములతో
ఆ..ఆ.. గంభీర తాళముతో - ఎల్లప్పుడు‖ ఎల్లప్పుడు ‖
Verse
సకల ప్రాణులెహోవాను స్తుతించుడి - హల్లెలుయా ఆమెన్
ఆ..ఆ.. హల్లెలుయా ఆమెన్ - ఎల్లప్పుడు‖ ఎల్లప్పుడు ‖

Related Tags

PraiseWorshipPsalm