Verse
దేవుని వారసులం – ప్రేమ నివాసులము
జీవన యాత్రికులం – యేసుని దాసులము
నవ యుగ సైనికులం – పరలోక పౌరులము
హల్లెలూయ – నవ యుగ సైనికులం – పరలోక పౌరులము‖ దేవుని ‖
Verse
సజీవ సిలువ ప్రభు – సమాధి గెలుచుటకే
విజేత ప్రేమికులం – విధేయ బోధకులం
నిజముగ రక్షణ ప్రబలుటకై
ధ్వజముగ సిలువను నిలుపుదుము‖ 2x దేవుని ‖
Verse
ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా
విభు మహిమను గాంచ – విశ్వమే మేము గోల
శుభములు గూర్చుచు మాలోన
శోభిల్లు యేసుని చూపుదుము‖ 2x దేవుని ‖
Verse
దారుణ హింస లలో – దేవుని దూతలుగా
ఆరని జ్వాలలలో – ఆగని జయములతో
మారని ప్రేమ సమర్పణతో
సర్వత్ర యేసుని కీర్తింతుము‖ 2x దేవుని ‖
Verse
పరిశుద్దాత్మునికై – ప్రార్థన సలుపుదము
పరమాత్ముని రాక – బలము ప్రసాదింప
ధరణిలో ప్రభువును జూపుటకై
సర్వాంగ హోమము జేయుదము‖ 2x దేవుని ‖
Verse
అనుదిన కూటములు – అందరి గృహములలో
ఆనందముతోను – ఆరాధనలాయే
వీనుల విందగు పాటలతో
ధ్యానము చేయుచు మురియుదము‖ 2x దేవుని ‖
Verse
హత సాక్షుల కాలం – అవనిలో చెలరేగ
గతకాలపు సేవ – గొల్గొతా గిరి జేర
భీతులలో బహు రీతులలో
నూతన లోకము కాంక్షింతుము‖ 2x దేవుని ‖