Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devuni Vaarasulam Prema Nivasulam

దేవుని వారసులం ప్రేమ నివాసులము

Devuni Vaarasulam Prema Nivasulam

Verse
దేవుని వారసులం - ప్రేమ నివాసులము
జీవన యాత్రికులం - యేసుని దాసులము
నవ యుగ సైనికులం - పరలోక పౌరులము
హల్లెలూయ - నవ యుగ సైనికులం - పరలోక పౌరులము
Verse
దారుణ హింస లలో - దేవుని దూతలుగా
ఆరని జ్వాలలలో - ఆగని జయములతో
మారని ప్రేమ సమర్పణతో - సర్వత్ర యేసుని కీర్తింతుము
Verse
పరిశుద్దాత్మునికై - ప్రార్థన సలుపుదము
పరమాత్ముని రాక - బలము ప్రసాదింప
ధరణిలో ప్రభువును జూపుటకై - సర్వాంగ హోమము జేయుదము
Verse
అనుదిన కూటములు - అందరి గృహములలో
ఆనందముతోను - ఆరాధనలాయే
వీనుల వినదగు పాటలతో - ధ్యానము చేయుచు మరియుదము

Related Tags

PraiseWorship