Chorus
దేవుని వారసులం ప్రేమ నివాసులము
జీవన యాత్రికులం యేసుని దాసులము నవయుగ
సైనికులం పరలోకపౌరులము హల్లెలూయ నవయుగ
Verse
దారుణ హింసలలో దేవుని దూతలుగా
ఆరని జ్వాలలో ఆగని జయములతో మారని ప్రేమ
సమర్పణతో సర్వత్ర యేసును కీర్తింతము‖ దేవుని ‖
Verse
పరిశుద్ధాత్మునికై ప్రార్థన సలుపుదము
పరమాత్ముని రాక బలము ప్రసాదింప ధరణిలో ప్రభువును
జూపుటకై సర్వాంగహోమము జేయుదము‖ దేవుని ‖
Verse
అనుదిన కూటములు అందరి గృహములలో
ఆనందముతోను ఆరాధనలాయో వీనులవిందగు పాటలతో
ధ్యానము చేయుచు మరియుదుము‖ దేవుని ‖
Verse
సజీవ సిలువ ప్రభు సమాధి గెలుచుటచే
విజేత ప్రేమికులం విధేయ బోధకులం నిజముగ రక్షణ
ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదము‖ దేవుని ‖
Verse
గోధుమ గింజవలె క్రీస్తుడు చావగను
నాధుని మరణములో శాశ్వత జీవమును నిధులుగ పండించి
లేవగను మాధుర్య రక్షణ లభియించెను‖ దేవుని ‖
Verse
హతసాక్షుల కాలం అవనిలో చెలరేగ
గతకాలపు సేవ గొల్గొత గిరి భీతులలో బహురీతులలో
నూతన లోకము కాంక్షింతుము‖ దేవుని ‖
Verse
ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగ
విభు మహిమను గాంచ విశ్వమే మముగోర శుభములు
గూర్చుచు మాలోన శోభిల్లుయేసును జూపుదము‖ దేవుని ‖