Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devuni Varasulam Prema Nivasulamu

దేవుని వారసులం ప్రేమ నివాసులము

Devuni Varasulam Prema Nivasulamu

Verse
దేవుని వారసులం ప్రేమ నివాసులము
జీవన యాత్రికులం యేసుని దాసులము
నవయుగ సైనికులం పరలోకం పౌరులము హల్లెలూయ
నవయుగ సైనికులం పరలోక పౌరులము
Verse
దారుణ హింసలలో దేవుని దూతలుగా
ఆరని జ్వాలలలో ఆగని జయములతో
మారని ప్రేమ సమర్పణతో
సర్వత్ర యేసుని కీర్తింతుము
Verse
పరిశుద్దాత్మునికై ప్రార్ధన సలుపుదుము
పరమాత్ముని రాక బలము ప్రసాదింప
ధరణిలో ప్రభువును జూపుటకై
సర్వాంగ హోమము చేయుదము
Verse
సజీవ సిలువ ప్రభు సమాధి గెలుచుటచే
విజేత ప్రేమికులం విధేయ బోధకులం
నిజముగ రక్షణ ప్రబలుటకై
ధ్యజముగ సిలువను నిలుపుదము

Related Tags

WorshipDevotionalChristian