Chorus
పల్లవి:
దేవుని యందు నిరీక్షణనుంచి - ఆయనను స్తుతించు నా ప్రాణమా
Verse
ఏ అపాయము రాకుండ నిన్ను - దివారాత్రులు కాపాడువాడు (2X)‖ 2x ‖
ప్రతిక్షణం నీపక్షముండు - రక్షకుడు
Verse
చీకటిని వెలుగుగా చేసి - ఆయనే నీముందు పోవువాడు (2X)‖ 2x ‖
సత్యమగు - జీవమగు - మార్గ - మేసె
Verse
తల్లి తన బిడ్డను మరచినను - మరువడు నీ దేవుడు నిన్ను (2X)‖ 2x ‖
తల్లి కన్నా - తండ్రి కన్నా - ఉత్తముడు
Verse
నీకు సహాయము చేయువాడు - సదా ఆదుకొనువాడు ఆయనే (2X)‖ 2x ‖
ఆధారము - ఆదరణ - ఆయనలో
Verse
నీకు విరోధముగా రుపించిన - ఏవిధ ఆయుధమును వర్ధిల్లదు (2X)‖ 2x ‖
శత్రువులు - మిత్రులుగా - మారెదరు
Verse
పర్వతములు తొలగిపోయినను - తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2X)‖ 2x ‖
కనికర - సంపన్నుడు - నాదేవుడు
Verse
స్తుతి మహిమలు నీకే ప్రభు - నిత్యము నిన్నే కొనియాడెద (2X)‖ 2x ‖
హల్లేలూయ - హల్లేలూయ - హల్లేలూయ