Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devuni Yandu Nirikshana Nunchi

దేవుని యందు నిరీక్షణ నుంచి

Devuni Yandu Nirikshana Nunchi

Verse
దేవుని యందు నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా
Verse
ఏ పాయము రాకుండ నిన్ను దివారాత్రులు కాపాడు వాడు
ప్రతిక్షణం నీపక్షముండు రక్షకుడు
Verse
చీకటిని వెలుగుగ చేసి ఆయన నీ ముందు పోవువాడు
సత్యమగు జీవమగు మార్గము యేసే
Verse
నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొను వాడు ఆయనే
ఆధారము ఆధరణ ఆయనలో
Verse
తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను
తల్లి కన్న తండ్రికన్న ఉత్తముడు
Verse
నీకు విరోధముగా నిరూపించిన ఏవిధ ఆయుధమును వర్ధిల్లదు
శత్రువులు మిత్రులుగా మారుదురు
Verse
పర్వతములు తొలగి పోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు
కనికర సంపన్నుడు నీ దేవుడు
Verse
స్తుతి మహిమలు నీకే ప్రభు నిత్యము నిన్నే కొనియాడెద
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

Related Tags

PraiseFaithProtectionHope