Chorus
దేవునికే మహిమ‖ 2x ‖
యుగయుగములకు కలుగును గాక‖ 2x ‖
దేవునికే మహిమ‖ 2x ‖
Verse
దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో
దానికి మనలను వారసుల జేసెను
వందనములను చెల్లింతము
Verse
నిలవరమైనది మనకిల లేదని
వల్లభుడు స్థిరపరచెను పరమందు
చెల్లించి స్తుతులను పూజింతుము
Verse
సీయోను పురమగు దేవుని నగరుకు
సొంపుగ తెచ్చెను తన కృప ద్వారానే
స్తోత్రగీతములను పాడెదము
Verse
పరదేశులుగా మనలను చేయక
ప్రభుని యింటికి వారసులుగ జేసె
పాడి పొగడెదము మన ప్రభుని
Verse
శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన
ముత్యాల గుమ్మముల పురమందు జేర్చెను
ముదమారగను ప్రణుతింతుము