Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devuniki Bhayapadavaa

దేవునికి భయపడవా

Devuniki Bhayapadavaa

Lyricist: Diyya Prasada Rao
Verse
దేవునికి భయపడవా మానవా
నీ దేవునికి భయపడవా మానవా‖ 2x ‖
పాపాన్ని విడువుమా – ప్రభు చెంత చేరుమా‖ 2x ‖
యేసయ్యను నీవు శరణు వేడుమా‖ 2x దేవునికి ‖
Verse
ఐగుప్తు మంత్రసానుల గమనించితివా
రాజాజ్ఞను సైతము అతిక్రమించిరి‖ 2x ‖
దేవునికి విధేయత చూపిరి
వంశాభివృద్ధిని పొందిరి‖ 2x దేవునికి ‖
Verse
నినెవె ప్రజలను గమనించితివా
దేవుని మాటకు లోబడినారు‖ 2x ‖
పాపమును విడిచి ఉపవాసముండి
ప్రార్థించి ప్రభు దీవెన పొందిరి‖ 2x దేవునికి ‖

Related Tags

RepentanceFear Of GodObedience