Verse
దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తి
చెవియొగ్గువరకు మనవి చేయుచుందును
Verse
ప్రభుని ఆపదల యందు వెదకువాడను
ప్రాణము పొంద జాలకున్నది యోదార్పును
Verse
పూర్వ సంవత్సరములను తలచుకొందును
పాడిన పాట రాత్రి జ్ఞప్తినుంచుకొందును
Verse
హృదయమున నిన్ను ధ్యానించుకొందురు
శ్రద్ధగ నా యాత్మ నీ తీర్పు వెదకుచున్నది
Verse
ప్రభువు నన్ను నిత్యము విడిచిపెట్టునా?
ప్రభువింకెన్నటికిని కటాక్షముంచడా?
Verse
దేవుడు నన్ను కనికరింపక మానివేసెనా?
దేవుడు కోపముతో కృప చూపకుండునా?
Verse
మహోన్నతుని దక్షిణ హస్తము మారెను
అనుకొనుటకు నా శ్రమలే కారణము
Verse
దేవా నీ పూర్వపు ఆశ్చర్యకార్యములను
తలంచు కొందు నాదు మనస్సులో నిప్పుడు
Verse
నీ కార్యమంతటిని ధ్యానించుకొందును
నీ క్రియలను ధ్యానము నే జేసికొందును
Verse
మహా పరిశుద్ధమైనది నీదు మార్గము
మహా దేవా నీ వంటివాడు ఎక్కడున్నాడు?
Verse
ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే
జనములలో ప్రభావమును చూపియున్నావు